schedule Saturday, September 19, 2026

తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..!

calendar_today August 27, 2023
person dharshininews
తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..!
తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..! - ఎల్లుండి డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా - ప్రకటించిన కళాశాల ప్రిన్సిపల్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతా నిరుద్యోగులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శుభవార్త తెలిపారు. ఎల్లుండి మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 2019 - 23 మద్యలో డిగ్రీ పాసైన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ జాబ్‌ మేళాలలో టెక్ మహేంద్ర, సైకీస్, ఎరిటీ సోల్యూషన్, జెన్‌పాక్ట్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బీపీఓసీ, కనెక్టు కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు పదో తరగతి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్ లతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకరావాలని సూచించారు. తాండూరు ప్రాంత నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి.... https://dharshininews.com/19712