schedule Saturday, July 04, 2026

భావితరాలకు పచ్చని ఊపిరిపోద్దాం..!

calendar_today August 29, 2023
person dharshininews
భావితరాలకు పచ్చని ఊపిరిపోద్దాం..!
భావితరాలకు పచ్చని ఊపిరిపోద్దాం..! - పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ - గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి: భావితరాలు ఆరోగ్యంగా జీవించేందుకు పచ్చని ఊపిరి పొద్దామని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య అన్నారు. తాండూరులోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు తెలుగు భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి తాండూరు పీపుల్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ వరలక్ష్మీ ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ, వరలక్ష్మీలతో పాటు పలువురు మహిళలు గ్రీన్ ఇండియా చాలెంజ్లో 29 మొక్కలు నాటారు. అనంతరం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ తెలుగు ప్రిన్సిపల్ వరలక్ష్మిని, క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని చైతన్య కాలేజీ పేటి రాములను సన్మానించారు. అనంతరం వారు రిటైర్డ్ ప్రిన్సిపల్ వరలక్ష్మీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలే దోహదపడతాయన్నారు. గ్రీస్ ఇండియా చాలెంజ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించి భావితరాలకు పచ్చని ఊపిరిపోద్దామని పిలుపునిచ్చారు. కావున అందరు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రా కన్వీనర్ కేవీఎం వెంకట్, ప్రిన్సిపల్ స్వప్న, బీఆర్ఎస్ నాయకులు కోటం సిద్ధలింగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడ చదవండి... https://dharshininews.com/19760