అమ్మాయిలందరికి ఆత్మస్థైర్యం అవసరం
August 30, 2023
dharshininews
అమ్మాయిలందరికి ఆత్మస్థైర్యం అవసరం
- హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
- తాండూరు రూరల్ సీఐ రాంబాబు
- జినుగుర్తిలో వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అమ్మాయిలందరూ ఆత్మస్థైర్యంగా మెలగాల్సిన అవసరముందని తాండూరు రూరల్ సీఐ రాంబాబు అన్నారు. బుధవారం తాండూరు మండలం జినుగుర్తిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ రాంబాబు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, మహిళల స్థైర్యం, బాలికలు/మహిళల హక్కులు, లక్ష్యాల సాధనతో పాటు సైబర్ నేరాలు, డయల్ 100 సేవలపై అవగాహన కల్పించారు. అనంతరం సీఐ రాంబాబు మాట్లాడుతూ నేటి సమాజంలో అమ్మాయిలు, మహిళలు ఆత్మస్థైర్యం కలిగి ఉండాల్సిన అవసరముందన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, హక్కులపై అవగాహన పెంచుకో వాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆపదలో ఉంటే డయల్ 100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరణ్ కోట్ ఎస్ఐ విమల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..
https://dharshininews.com/19789