schedule Saturday, July 04, 2026

ఓటు హక్కు తప్పక నమోదు చేసుకోవాలి

calendar_today September 1, 2023
person dharshininews
ఓటు హక్కు తప్పక నమోదు చేసుకోవాలి
ఓటు హక్కు తప్పక నమోదు చేసుకోవాలి - ఈనెల 19వ తేది వరకు అవకాశం - తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి :18 ఏండ్లు నిండిన వయోజనులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులకు ఓటు వేసే హక్కు కల్పించిందన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడం అందరి బాధ్యత అన్నారు. ఓటు హక్కు అందరికి వజ్రాయుధంలాంటిదన్నారు. సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటుతో సాధ్యమవుతుందన్నారు. ఓటు హక్కును అందరు తప్పక నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు నమోదుకు ఈనెల 19వ తేది వరకు అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ రాజీరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19841