schedule Saturday, September 05, 2026

ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన రాజుగౌడ్

calendar_today September 23, 2021
person dharshininews
ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన రాజుగౌడ్
ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన రాజుగౌడ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి తాండూరు టీఆర్ఎస్ నాయ‌కులు రాజుగౌడ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి నివాసంలో ఆయ‌న జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నాయ‌కులు రాజుగౌడ్ మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలుతో క‌లిసి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. వారు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిని శాలువాతో స‌త్క‌రించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఫోటోను బ‌హుక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు ఎర్రం శ్రీధర్, శివానంద్, సోమనాథ్ త‌దిత‌రులు ఉన్నారు.