ప్రసూతి సేవల్లో టాప్‌లో నిలపాలి
September 6, 2023
dharshininews
ప్రసూతి సేవల్లో టాప్‌లో నిలపాలి
- గర్భిణీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి
- వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయం పాటించాలి
- జిల్లా ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిండెంట్ డా. మూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) ప్రసూతి సేవల్లో టాప్ లో నిలిపేందుకు వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు కృషి చేయాలని జిల్లా ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిండెంట్ డా. మూర్తి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో ఎంసీహెచ్ గైనకాలజీస్టు వైద్యులు, వివిధ పీహెచ్ఎసీ(ఆరోగ్య కేంద్రాలు)ల మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సూపరిండెంట్ డా. మూర్తి మాట్లాడుతూ ప్రసూతి సేవల్లో తాండూరు ఎంసీహెచ్ ఆసుపత్రి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను పెంచి టాప్ లో నిలిచేలా కృషి చేయాలన్నారు. ఇందుకు గైనకాలజిస్టులు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయం పాటించాలన్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గర్బిణీల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్టులు పర్యవేక్షిస్తుండాలన్నారు. ఆసుపత్రిలో చేరిన గర్భిణీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా దృష్టిసారించాలన్నారు.
ప్రవేటు ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన సేవలను అందించేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ సాయిబాబా, ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/20018/