schedule Saturday, September 05, 2026

పరవళ్లకు సిద్దమైన పాలమూరు

calendar_today September 14, 2023
person dharshininews
పరవళ్లకు సిద్దమైన పాలమూరు
పరవళ్లకు సిద్దమైన పాలమూరు - పరుగెత్తుకొస్తున్న కృష్ణా జలాలు - ప్రత్యేకతలు ఉన్న పంపుహౌస్ - ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తరతరాల రైతులు ఎదురుచూస్తున్న కృష్ణాజలాలు పరవళ్లు తొక్కేందుకు సమయం అసన్నమైంది. కాళేశ్వరాన్ని మించి బాహుబలి నిర్మాణాలకు ‘పాలమూరు’ ప్రాజెక్టు వేదికగా నిలుస్తోంది. ఈ ఎత్తిపోతల్లో ఆరు దశల్లో ఆరు జలాశయాలు, అయిదు పంపు హౌసుల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 18 ప్యాకేజీలుగా నార్లాపూర్‌ నుంచి ఉదండాపూర్‌ వరకు ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో చాలావరకు మేఘా సంస్థ చేస్తోంది. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో ప్రాజెక్టులో నాలుగు పంపుహౌసుల్లో పంపులను ఏర్పాటు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం రేగిమానుగడ్డ వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకంలోని మొదటి పంపుహౌసులో ఒక పంపు ప్రారంభానికి సిద్ధమైంది. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుంది. ఊహకందని భారీ నిర్మాణాలు, అద్భుత సాంకేతికత, భారీ సొరంగాలు, భూగర్భంలోనే సర్జిపూల్స్‌, పంపు హౌసులు ఈ ఎత్తిపోతలకు తలమానికంగా నిలుస్తున్నాయి. కోతిగుండు నుంచి కృష్ణా నదీ జలాలను కాలువ ద్వారా పంపుహౌసుకు తరలించి నార్లాపూర్‌ సమీపంలో నిర్మించిన జలాశయంలో ఎత్తిపోసేందుకు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ పంపు మీట నొక్కి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రత్యేకతలు 90 టీఎంసీల జలాల తరలింపు దేశంలోనే అతి పెద్ద సర్జిపూళ్లు, పంపుహౌసుల నిర్మాణం సిద్ధమైన నార్లాపూర్‌ పంపుహౌసు, జలాశయం 3,200 క్యూసెక్కులు ఎత్తిపోసే సామర్థ్యమున్న పంపు ఇది కూడా చదవండి... https://dharshininews.com/20223/