schedule Saturday, September 19, 2026

ఓటు హక్కు ప్రాధాన్యమైంది

calendar_today September 14, 2023
person dharshininews
ఓటు హక్కు ప్రాధాన్యమైంది
ఓటు హక్కు ప్రాధాన్యమైంది - పీపుల్స్ డిగ్రీ కాలేజీ సత్యానంద్ - విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో ఓటు హక్కు అత్యంత్య ప్రాధాన్యమైందని తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సత్యానంద్ అన్నారు. గురువారం పీపుల్స్ కాలేజీలో విద్యార్థులకు స్వీప్ పై అవగాహన కల్పించారు. సాంఘిక ప్రదర్శనలు, పాటల పోటీలు, చిత్ర లేఖనం వంటి పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ సత్యానంద్ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ప్రాధన్యమైందన్నారు. సమర్థవంతమైన పాలనను ఎన్నుకోవాలంటే ఓటుతో సాధ్యమవుతుందన్నారు. కావున 18 ఏండ్లు నిండిన విద్యార్థులు. యువతీ, యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20239/