అందరం స్వచ్ఛత పాటిద్దాం
September 20, 2023
dharshininews
అందరం స్వచ్ఛత పాటిద్దాం
- మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
- తాండూరులో ఇండియన్ స్వచ్ఛత లీగ్ ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి స్వచ్ఛతను పాటిద్దామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు.. బుధవారం ఇండియన్ స్వచ్ఛత లీగ్ సీజన్-2లో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డులో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్. మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా సమక్షంలో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి వార్డులో. ర్యాలీ చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతపై నినాదాలు చేశారు. అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పారిశుధ్యంను పాటించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వార్డు, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరి పై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, మెప్మా టీఎంసీ, సీఓ, ఆర్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/20400/
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, మెప్మా టీఎంసీ, సీఓ, ఆర్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/20400/