schedule Saturday, July 04, 2026

రక్తదానం చేసిన యువకులు

calendar_today September 28, 2023
person dharshininews
రక్తదానం చేసిన యువకులు
రక్తదానం చేసిన యువకులు - ఇందిరానగర్ యువకులు ఔధార్యం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన మైనార్టీ యువకులు రక్తదానం చేసి ఔదర్యాన్ని చాటుకున్నారు. గురువారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 4వ ఇందిరానగర్ కు చెందిన జమీర్ బాయి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు దాదాపు 100 మంది వరకు పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని ఉర్దూగర్  మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం,  పలువురు పెద్దలుసదర్శించి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతి సమాజానికి అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20680/