schedule Saturday, July 04, 2026

స్వచ్ఛతకు ప్రాధాన్యం

calendar_today October 1, 2023
person dharshininews
స్వచ్ఛతకు ప్రాధాన్యం
స్వచ్ఛతకు ప్రాధాన్యం - అందరు పరిశుభ్రతను పాటించాలి. - తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో శ్రమదానం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బ్యానర్ తో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఇందిరా చౌరస్తా వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఇందిరా చౌరస్తా సమీపంలో ఉన్న డివైడైర్ లో మొక్కల మద్య ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. మట్టి దిబ్బలను చదును చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ పట్టణంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్తను ఆరుబయట పడేయకుండా చెత్త బుట్టలను వినియోగించి వాహనాలు వచ్చినప్పుడు అందిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డి, సినీయర్ అసిస్టెంట్ రమేష్, జవాన్లు, శ్రీనివాస్ బాలు, వీరణ్ణ, అశోక్, వెంకటేష్, గౌతాపూర్ శ్రీనివాస్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20734/