schedule Sunday, September 06, 2026

అజ్మీర్ ద‌ర్గా ద‌ర్శ‌నానికి వెళ్లిన స‌య్య‌ద్ అబ్దుల్ సాబీర్ పాష‌

calendar_today September 25, 2021
person dharshininews
అజ్మీర్ ద‌ర్గా ద‌ర్శ‌నానికి వెళ్లిన స‌య్య‌ద్ అబ్దుల్ సాబీర్ పాష‌
అజ్మీర్ ద‌ర్గా ద‌ర్శ‌నానికి వెళ్లిన స‌య్య‌ద్ అబ్దుల్ సాబీర్ పాష‌ - మిత్ర‌బృందంతో క‌లిసి ప‌య‌నం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాజ‌స్థాన్‌లోని అజ్మీర్ ద‌ర్గాను ద‌ర్శించుకునేందుకు వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌సిద్ద‌ సయ్యద్ అబ్దుల్ కరీం పాషా దర్గా గారి మనమడు సయ్యద్ అబ్దుల్ సాబీర్ పాష బ‌య‌ల్దేరి వెళ్లారు. శ‌నివారం అత‌ను త‌న మిత్రులు అఫ్సర్ ఖాన్, నజీర్, సయ్యద్ జలాల్, సమద్, ఖాయుం, మొహమ్మద్ జిలాని, మొహమ్మద్ నూర్‌ల‌తో క‌లిసి ద‌ర్శ‌నానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా సయ్యద్ అబ్దుల్ సాబీర్ పాష మాట్లాడుతూ అంద‌రు సంతోషంగా ఉండాల‌ని వేడుకునేందుకు ద‌ర్గా ద‌ర్శ‌నానికి వెళుతున్న‌ట్లు తెలిపారు.