ఈ యేడాదిలో చివరి చంద్రగ్రహణం..!
October 2, 2023
dharshininews
ఈ యేడాదిలో చివరి చంద్రగ్రహణం..!
- ఆరోజు తిరుమల శ్రీవారి దేవాలయం మూత
- పలు దేవాలయాలకు గ్రహణం ఎఫెక్ట్
దర్శిని డెస్క్ : గ్రహణ సమయాన్ని సూతక కాలంగా హిందువులు భావిస్తారు. ఈ సమయంలో పనులు చేయడం పాపంగా భావిస్తారు. పూజ గదిని కూడా మూసివేస్తారు.
ఈ సంవత్సరంలో రెండవది.. చివరిదైన చంద్రగ్రహణం ఈ నెల 29వ తేదీన ఏర్పడనుంది. మన దేశంలో కూడా ఈ పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం చూపనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పనుండి. కనుక ముందు రోజు అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు స్వామివారి అన్ని రకాల దర్శనాలు నిలిపివేస్తారు. శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి గ్రహణం విడిచిన అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి ఆలయ ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు.
అంటే చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి తెల్లవారు జామున వరకూ దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో శీవారి సహస్ర దీపాలంకార సేవ తో పాటు వికలాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనాలను అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/20727/