schedule Saturday, July 04, 2026

ఉద్యోగులకు తీపికబురు..!

calendar_today October 3, 2023
person dharshininews
ఉద్యోగులకు తీపికబురు..!
ఉద్యోగులకు తీపికబురు..! - 5 శాతం ఐఆర్ చెల్లింపుకు నిర్ణయం - కొత్తగా పీఆర్సీ కమిటి నియామకం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ(పీఆర్‌సీ)ని నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌ శివశంకర్‌ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యుడిగా బీ రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అత్యంత వేగంగా కొత్త పీఆర్సీని ప్రభుత్వం నియమించింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5% మధ్యంతర భృతి(ఐఆర్‌)ని ఈ నెల ఒకటి నుంచి ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీలు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపజేయనున్నారు. పీఆర్సీ బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటుచేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. వేతన సవరణలను సిఫారసు చేసే క్రమంలో తెలంగాణ ఉద్యోగుల ప్రస్తుత పేస్కేల్స్‌, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను పరిగణనలోకి తీసుకోవాలని పీఆర్సీకి సూచించారు. అక్టోబర్‌ ఒకటి నుంచే ఐఆర్‌ అమలు.. పీఆర్సీతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) అక్టోబర్‌ ఒకటి నుంచి అమలులోకి రానుంది. ఒక పీఆర్సీ సిఫారసులు ఆలస్యమయ్యే అవకాశాలున్న అన్ని సందర్భాల్లోనూ ఐఆర్‌ ప్రకటించడం అనవాయితీగా వస్తున్నది. పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ ఖరారు చేసిన తర్వాత, ఈ ఆలస్యమైన కాలానికి ఈ ఐఆర్‌ను మినహాయించి, మిగతా మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తారు. ప్రస్తుతానికి బేసిక్‌ పేపై 5శాతం ఐఆర్‌ను కలిపి వేతనాల్లో జమచేయనున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20768/