schedule Saturday, July 04, 2026

దంతాల సంరక్షణపై జాగ్రత్తలు వహించాలి

calendar_today October 3, 2023
person dharshininews
దంతాల సంరక్షణపై జాగ్రత్తలు వహించాలి
దంతాల సంరక్షణపై జాగ్రత్తలు వహించాలి - చైతన్య కాలేజీలో దంత వైద్య శిబిరం - పరీక్షలు చేసిన శ్రీసాయి డెంటల్ కాలేజీ వైద్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు దంతాల సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దంత వైద్యులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో కాలేజీ యజమాన్యం, మధుకర సేవా సమితి, శ్రీ సాయి డెంటల్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు 470 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. అనంతరం దంత వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కవ వేడి, చల్లని పదార్థాలు తీసుకోరాదని. సూచించారు. ఉదయం, రాత్రి రెండు పూటల దంతాలను శుభ్రం చేసుకోవాలన్నారు. అదేవిధంగా కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, మధుకర సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ దంతాల సంరక్షణపై విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటి నొప్పి ఇతర సమస్యలు ఉంటే దంత వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సోమనాథ్, మధుకర సేవా సమితి సభ్యులు సుభాష్ రెడ్డి, పురుషోత్తం, బిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20791/