schedule Sunday, July 05, 2026

ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ

calendar_today October 16, 2023
person dharshininews
ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ
ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ - బంగారం, నగదు దోచుకెళ్లిన దొంగలు - పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఊరికి వెళ్లిన ఉపాధ్యాయుడు ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ లో వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదర్శనగర్ లోని విశ్వనాధ్ అనే ఉపాధ్యాయుడు ఇంట్లో మరో ఉపాధ్యాయుడు భీమప్ప అద్దెకు ఉంటున్నారు. దసరా పండగ సెలవుల సందర్భంగా కుటుంబంతో కలిసి ఇంటికి తాళంవేసి సొంత ఊరికి వెళ్లారు. తాళం వేసి ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు ధ్వసం చేసి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న అర్థతొలం బంగారంతో పాటు రూ. 20 వేల నగదును ఎత్తుకెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు భీమప్ప ఇంటికి చేరుకుని పరిశీలించారు. జరిగిన సంఘటనపై తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. కాగా ఉపాధ్యాయుడు ఇంటితో పాటు మరో ఇంట్లో కూడా చోరికి యత్నం జరిగిందని, కాని అక్కడా చోరీ జరగలేదని సీఐ తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21130/