schedule Saturday, September 05, 2026

మున్సిల్ యంత్రాంగం అలెర్ట్

calendar_today September 28, 2021
person dharshininews
మున్సిల్ యంత్రాంగం అలెర్ట్
మున్సిల్ యంత్రాంగం అలెర్ట్ - కంట్రోల్ రూమ్‌, రిస్క్యూ టీంల ఏర్పాటు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గులాబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్ష సూచనల మేర‌కు తాండూరు మున్సిప‌ల్ యంత్రాంగం అప్రమ‌త్త‌మ‌య్యింది. జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల ఆదేశాల మేర‌కు తాండూరు ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ కార్యాల‌యంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సెల్: 9490996606కు కూడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఎవ‌రైనా ఇబ్బందుల‌లో ఉంటే స‌హాయం అందించేందుకు ప్ర‌తి వార్డు కోసం రిస్క్యూ టీంల‌ను నియ‌మించారు. ముఖ్యంగా మున్సిప‌ల్ వాహ‌నాల ద్వారా భారీ వ‌ర్షాల‌తో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన ఇండ్లలో నివాసం ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల‌ని, ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైతే మున్సిపల్ కమిషనర్, ఆ ఏరియా జవాన్లకు స‌మాచారం అందించాల‌ని, మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌కు సెల్: 9490996606, 9701097801ల‌కు సంప్ర‌దించాల‌ని అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు.