schedule Monday, September 14, 2026

పదవులేమతాయో..!

calendar_today December 6, 2023
person dharshininews
పదవులేమతాయో..!
పదవులేమతాయో..! - తటస్థమా.. తప్పుకోవడమా..? - నామినేటేట్ నేతల్లో అయోమయం, ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరబోతోంది. ఇదే విషయంపై అంతటా చర్చజరుగుతుండగా జిల్లాలో మాత్రం నామినేటేడ్ పదవుల విషయంలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వికారాబాద్, పరిగి, కోడంగల్, తాండూరు, కోట్ పల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలు నామినేటేడ్ పదవులు దక్కించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. పైగా ప్రభుత్వం కూడా మారుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో కొందరు నేతలు స్వచ్చందంగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. కోడంగల్ మార్కెట్ కమిటి చైర్మన్,వైస్ చైర్మన్లు ఈ విషయాన్ని ప్రకటించారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూరు, బషీరాబాద్‌, కోట్‌ పల్లి మార్కెట్ కమిటి చైర్ పర్సన్ పదవులను బీఆర్ఎస్ నేతలు దక్కించుకున్నారు. తాండూరు నుంచి బీఆర్ఎస్ సీనీయర్ నేత రాజుగౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్ పర్సన్, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్ పర్సన్‌లు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు పదవుల్లో కొనసాగాలా వద్దా అనే సందిగ్దంలో ఉన్నారు. మార్కెట్ కమిటి చైర్ పర్సన్‌ పదవులకు రెండేళ్లు కొనసాగే అధికారం ఉంటుందని జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా జీవోను ప్రకటించారు. ఒకవేళ కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం అర్డినెన్స్ ను తీసుకవచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో నామినేటేడ్ పదవుల్లో కొనసాగుతున్న నేతలు ఆందోళన, అయోమయానికి గురవుతున్నారు. అయితే ప్రభుత్వం చట్ట సవరణలు చేస్తే అసెంబ్లీ సమావేశం సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అంటే అప్పటి వరకు నామినేటేడ్ పదవుల్లో కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22427/