schedule Saturday, July 04, 2026

మైనార్టీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..!

calendar_today December 9, 2023
person dharshininews
మైనార్టీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..!
మైనార్టీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..! - కేఏయూ నుంచి పూర్తి నిధుల స్కాలర్‌ షిఫ్‌ - మాస్టర్స్, ఫీహెచ్‌డీ అభ్యర్థులకు ఉపయోగం - ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు సంక్షేమ శాఖ అధికారులు గుడ్‌ న్యూస్ చెప్పారు. సౌది అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వ విద్యాలయం(కేఏయూ) నుంచి విద్యార్థులకు పూర్తి నిధుల స్కాలర్‌షిప్‌ అందిస్తుందని జిల్లా అధికారిణి సుధారాణి ఓ ప్రకటినలో తెలిపారు. 2023-2024 విధ్య సంవత్సరానికి గాను మైనారిటీ విద్యార్థుల నుంచి ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మాస్టర్, పీహెచ్‌డీలతో పాటు డిగ్రీ ప్రోగ్రాం కోర్సులు కొనసాగించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఇతర పూర్తి వివరాలకు (:https://graduatestudies.kau.edu.sa/Content-306-EN-278671)లో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ నెల 28 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎవరికి స్కాలర్‌షిఫ్‌ అందిస్తారో కింద తెలుసుకోండి. PhD అభ్యర్థులకు ఆర్ట్స్ & హ్యుమానిటీస్ ఫ్యాకల్టీ సామాన్య శాస్త్ర విభాగము ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ వాతావరణ శాస్త్ర ఫ్యాకల్టీ పర్యావరణం శుష్క భూమి వ్యవసాయం మెరైన్ సైన్స్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ కంప్యూటింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ మాస్టర్స్ అభ్యర్థుల కోసం ఆర్ట్స్ & హ్యుమానిటీస్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ సామాన్య శాస్త్ర విభాగము ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ వాతావరణ శాస్త్ర ఫ్యాకల్టీ పర్యావరణం శుష్క భూమి వ్యవసాయం మెరైన్ సైన్స్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ కంప్యూటింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ ఇది కూడా చదవండి... https://dharshininews.com/22506/