schedule Sunday, July 05, 2026

అనుమతి లేని ఆధార్ కేంద్రం సీజ్

calendar_today January 3, 2024
person dharshininews
అనుమతి లేని ఆధార్ కేంద్రం సీజ్
అనుమతి లేని ఆధార్ కేంద్రం సీజ్ - కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ తారాసింగ్ - కంప్యూటర్ సామాగ్రి తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాన్ని సీజ్ చేశారు. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ సమక్షంలో కేంద్రంలోని సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని సీసీఐ కాలనీలో సొంత ఇంటిలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు అనుమతులు లేకుండా ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్నారు. స్థానికులు ఈ విషయాన్ని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ దృష్టికి తీసుకవచ్చారు. దీంతో బుధవారం తహసీల్దార్ తారాసింగ్ ఆర్ ఐ రాజిరెడ్డితో కలిసి కేంద్రాన్ని సందర్శించారు. అనుమతులు లేకుండా కేంద్రం నిర్వహస్తున్నట్లు గుర్తించారు. అందులోని కంప్యూటర్, స్కానర్ ప్రింటర్లను స్వాదీనం చేసుకున్నారు. అయితే నిర్వహకులు రెండు రోజుల్లో అనుమతులు తీసుకవస్తామని అధికారులతో తెలిపారు. అనుమతులు పొందిన తరువాతే ఆధార్ సెంటర్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22924/