schedule Monday, September 14, 2026

ఎస్‌కేటీఎస్‌లో సంక్రాంతి శోభ..!

calendar_today January 11, 2024
person dharshininews
ఎస్‌కేటీఎస్‌లో సంక్రాంతి శోభ..!
ఎస్‌కేటీఎస్‌లో సంక్రాంతి శోభ..! - వైభవంగా ఉత్సవాలు జరుపుకున్న విద్యార్థులు - ఆకట్టుకున్న సంప్రదాయ వేషాధారణలు - అభినందించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని గురువారం పాఠశాలలో ముందస్తు సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మహిళలుగా, రైతులు, హరిదాసుల వేషాధారణలతో పాటు పలు వేషాధారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో పల్లెటూరులో పండగా ఏవిధంగా జరుపుకుంటారో కళ్లకు కట్టేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఇంట్లో పండిన ధాన్యాన్ని హరిదాసులకు వేయడం, పండగ రోజు ఇంట్లో పిండి వంటలు, ఇంటింటి ముందు ముగ్గులు వేయడం వంటి ప్రదర ధనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు, మహిళ టీచర్లు అందమైన ముగ్గులు వేసి పాఠశాల ఆవరణను వర్ణశోభితంగా మార్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్కూల్ చైర్మన్‌ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ఇంచార్జ్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండగ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు. రైతులు పొలాల్లో పండించిన పంట ఇంటికి చేరడంతో సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారని అన్నారు. పండగలోని సంప్రదాయాలను ఎవ్వరు మరువరాదని సూచించారు. అందరికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్. రమేష్, యజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23083/