schedule Sunday, July 05, 2026

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

calendar_today January 11, 2024
person dharshininews
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి - ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలి - తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ - కార్డెన్ సెర్చ్ లో 15 వాహనాల సీజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సైబర్ నేరాలపై అందరు అవగాహన కలిగి ఉండాలని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు వార్డులో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ సీఐలు రాంబాబు, రాజేందర్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు. వార్డులో తిరిగి అసాంఘీక శక్తులు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. దాదాపు 110 వాహనాలను తనిఖీ చేసే నెంబర్ ప్లేట్, దృవపత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అందరు అవగాహన కలిగిఉండాలన్నారు. వాహనాలను నడిపేవారు హెల్మెట్ ధరించాలని, దృవపత్రాలను కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిబంధనలు పాటించాలని సూచించారు. ఈవ్ టీజింగ్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అసాంఘీక కార్యక్రమాలకు, నేరాలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అబ్దుల్ రవూఫ్, మధుసూదన్ రెడ్డి, అరవింద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23088/