schedule Sunday, July 05, 2026

అదుపుతప్పి.. పొదల్లోకి దూసుకెళ్లి..!

calendar_today January 13, 2024
person dharshininews
అదుపుతప్పి.. పొదల్లోకి దూసుకెళ్లి..!
అదుపుతప్పి.. పొదల్లోకి దూసుకెళ్లి..! - తాండూరు ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం - అనంతగిరికొండల వద్ద ఘటన వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు కొండల్లోకి దూసుకెళ్లి తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. బస్సులో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన శనివారం వికారాబాద్‌ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్‌ నుంచి తాండూరుకు వెళ్తున్న బస్సు అనంతగిరి కొండల్లోని ఆఖరి మూలమలుపు సమీపంలో అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ బస్సులో సుమారు 90 మంది ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎదురుగా ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్స్‌ ఫెయిల్‌ అవడం వల్లే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్, కండక్టర్లు తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. https://www.youtube.com/watch?v=oXtPZ6pf_HI ఇదికూడా చదవండి... https://dharshininews.com/23126/