schedule Saturday, July 04, 2026

నల్ల యాలకుల్లో పోషకాలు..!

calendar_today January 19, 2024
person dharshininews
నల్ల యాలకుల్లో పోషకాలు..!
నల్ల యాలకుల్లో పోషకాలు..! - తింటే అనారోగ్యం సమస్యలు రావు - గుండె, కిడ్నీలపై ఎలా పనిచేస్తాయంటే..? దర్శిని డెస్క్‌: నల్ల యాలకులు.. వంటింట్లో లభించే ఔషధకారిణి. యాలకులంటే ఆకుపచ్చ రంగులో, చిన్నగా మాత్రమే ఉంటాయని చాలామంది అనుకుంటారు. కాని నల్ల యాలకులు కూడా ఉంటాయి. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులను ఎక్కువ వాడుతారు. కానీ నల్లగా, పెద్దగా ఉంటే నల్ల యాలకులు ఉన్నాయి. ఈ యలకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్లయాలకులు తింటే ఎలాంటి ఉపయోగాలన్నాయంటే వీటిని తింటే ఎన్నో ఆనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పెద్ద యాలకులు తింటే ఆకలి లేనివాకి ఆకలి పెరుగుతుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలిగిపోతాయి. పెద్ద యాలకుల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు చర్మ, రక్త ప్రసరణకు మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాని మేలు నల్ల యాలకులు గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. పెద్ద యాలకులు గుండె పనితీరుకు మేలు చేస్తుంది. గుండె కండరాల కణజాలంపై మంచిగా పనిచేయడంతో పాటు వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ గుండె సమస్యలు తొలగిపోయేలా చేస్తుంది. కిడ్ని సమస్యలు దూరం కిడ్ని సమస్యలపై కూడా నల్ల యాలకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. వీటి ద్వారా మూత్రవిసర్జన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతీరోజూ పెద్దయాలకులని తీసుకోవటం వలన కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. నోటీ బ్యాక్టీరియాకు చెక్ పెద్ద యాలకులు నోటి దుర్వాసన తగ్గి దంతాల ఇన్ఫెక్షన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నోటిలోని బ్యాక్టీరియా తగ్గిస్తుంది. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23220/