schedule Friday, September 04, 2026

చలిలో టీ లేదా కాఫీ బెస్ట్..!

calendar_today February 3, 2024
person dharshininews
చలిలో టీ లేదా కాఫీ బెస్ట్..!
చలిలో టీ లేదా కాఫీ బెస్ట్..! - ఇమ్యూనిటి పెంచే అవకాశాలు - జలుబు, దగ్గులపై ప్రభావం దర్శిని డెస్క్ : చల్లని చలికాలంలో కొందరు టీ ని, మరికొందరు కాఫీని ఇష్టపడుతుంటారు. ఈ చలికాలంలో టీ లేదా కాఫీ సేవించడం శరీరానికి బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శీతలకాలంలో వేడి పానీయాలు తాగేందుకు చాలా మంది సుముఖత చూసిస్తారు. అందులో ముఖ్యంగా టీ లేదా కాఫీ అంటే పిచ్చెక్కి పోతారు. రోజులో కనీసం నాలుగైదు సార్లైనా తాగేందుకు ఇష్టపడతారు. అయితే ఈ టీ/కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ లేదా టీ కడుపులో పడితే చాలు ఆ రోజంతా ఎంతో యాక్టివ్ గా పనిచేస్తారు. టీ లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీనిని సేవించడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మెదడులోని నరాలు ఉత్తేజానికి గురవుతాయి. బద్దకం, సోమరితనం, నిద్రను తమ నియంత్రణలో ఉంచుకోవచ్చు. వేడిగా గొంతు ద్వారా కడుపులోకి వెళ్లిన కాఫీ, టీ ఏదైనా ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది. ఆయుర్వేద మూలికలు టీ పొడిలో ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అల్లం టీ తీసుకుంటే అది విశ్రాంతిని, ప్రశాంతతను కలిగిస్తుంది. చలికాలంలో వేడి టీ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా చల్లబడదు. పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు ధరిచేరవని చెబుతున్నారు నిపుణులు. ఫ్రీ మోషన్ జరగడమే కాకుండా, కడుపులోని వికారం సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. గమనిక: ఈ వార్తను కేవలం అవగాహన కోసం అందించడం జరిగింది. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23585/