schedule Saturday, September 12, 2026

దేవాలయ పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్‌

calendar_today February 5, 2024
person dharshininews
దేవాలయ పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్‌
దేవాలయ పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్‌ - తాండూరులోని టెంపుళ్లకు నోటీఫికేషన్ జారీ - దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారుల ప్రకటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ఉన్న పలు దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటు దేవాదాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు దేవాలయాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం జినుగుర్తిలోని రామలింగేశ్వర దేవాలయం, చంద్రవంచలోని హనుమాన్ దేవాలయం, అంతారంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, పట్టణంలోని నీలకంఠ సమాధి, పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, బాలాజీ మందిర్, మండలంలోని చెంగోల్ హనుమాన్ దేవాలయంకు నోటీపికేషన్‌ వచ్చింది. అదేవిధంగా, బషీరాబాద్ మండలం క్యాద్గిర మారుతి దేవాలయం, మల్కాన్ గిరిలోని హనుమాన్ టెంపుల్, పెద్దేముల్ మండలంలోని మరో దేవాయలానికి పాలక మండళ్లను ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. నోటీసు వెలువడిన తేది నుంచి 20 రోజుల్లోపు ఆయా దేవాలయాల పాలక మండలి సభ్యుల పదవులుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23621/