schedule Saturday, September 12, 2026

ఎమ్మెల్సీ వర్గంలో జోష్..!

calendar_today February 9, 2024
person dharshininews
ఎమ్మెల్సీ వర్గంలో జోష్..!
ఎమ్మెల్సీ వర్గంలో జోష్..! - హస్తంలో చేరికపై సంబరాలు - పట్టణంలో నివాసం వద్ద నినాదాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో పుల్ జోష్ పుల్ వాతావరణం నిండింది. గురువారం రాత్రి హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి కుటుంబ సభ్యులతో కలవడం, పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావడంతో సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసం వద్ద డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ మహేందర్ రెడ్డి జిందాబాద్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మహేందర్ రెడ్డి చేరిక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పీటీసీ రవిశిందే, మల్కాపూర్ గనికార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23696/