schedule Sunday, September 13, 2026

డీజేలు పెడితే కేసులు

calendar_today February 9, 2024
person dharshininews
డీజేలు పెడితే కేసులు
డీజేలు పెడితే కేసులు - అనుమతులు నిషేధం - పట్టణ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో డీజే సౌండ్ సిస్టంపై నిషేధ ఆజ్ఞలు ఉన్నాయని, ఎవరైనా డీజేలు పెడితే కేసులు తప్పదని పట్టణ సీఐ సంతోష్ కుమార్ అన్నారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో సీఐ సంతోష్‌ కుమార్ డీజే సౌండ్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ డీజే సౌండ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్న నేపథ్యంలో డీజే సౌండ్‌ సిస్టమ్‌లకు అనుమతులు నిషేధించడం జరిగిందన్నారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట రిత్య కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23702/