schedule Saturday, September 12, 2026

మతిభ్రమించి మాట్లాడోద్దు..!

calendar_today February 9, 2024
person dharshininews
మతిభ్రమించి మాట్లాడోద్దు..!
మతిభ్రమించి మాట్లాడోద్దు..! - పార్టీలు మార్చిన మీరు నీతులు వల్లిస్తారా - ఎమ్మెల్పీపై, మా కుటుంబంపై వాఖ్యలు సరికాదు - మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మాజీ మంత్రి, ఎమ్మల్సీ మహేందర్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై జిల్లా గంథ్రాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మతిబ్రమించి వాఖ్యలు చేయడం సరికాదని తాండూరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు, సంగెంకలాన్ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ అన్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. కౌన్సిలర్ గా గెలిచిన రాజుగౌడ్ ఆ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. పార్టీలు మారిన చరిత్ర, నోటి దురుసును ఎవ్వరు సహించరని అన్నారు. ఒకప్పుడు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వెంట ఉండి ఇప్పుడు ఆయనపైనే వాఖ్యలు చేయడం పద్ధతి కానే కాదన్నారు. ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యేపై చేసిన దూషణలు ఎవ్వరు మరిచిపోలేదన్నారు. అప్పుడు ఆ గ్రూపు, ఈ గ్రూపు అంటూ ఊగిసలాడిన సంగతి అందరికి తెలుసన్నారు. పార్టీలు మార్చిన మీరే నీతులు వల్లిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఎవ్వరు నమ్మరని అన్నారు. తాండూరు ఎంపీపీ అనితా రవీందర్‌ గౌడ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ చేస్తున్న సేవలు అందరికి తెలుసు కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారని విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనవసరంగా మా కుటుంబంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23709/