schedule Saturday, July 04, 2026

పచ్చి ఉల్లిపాయలో ఉపయోగాలు..!

calendar_today February 11, 2024
person dharshininews
పచ్చి ఉల్లిపాయలో ఉపయోగాలు..!
పచ్చి ఉల్లిపాయలో ఉపయోగాలు..! - ప్రయోజనాలు అన్ని కావు - ఎముకల వ్యాధులకు చెక్ దర్శిని డెస్క్: ఇక ప్రతి ఒక్కటి వంటింట్లో ఉండేది ఉల్లిపాయలు. వీటి ప్రయోజనాలు అంతాఇంతా కాదు. ఉల్లిపాయలు అనేవి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తరిమికొడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. సరైన జీర్ణక్రియకు, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఇది చాలా ముఖ్యమైనది. మీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎముకల వ్యాధులకు చెక్ ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎములు బలోపేతం అవుతాయి.ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గిస్తుంది. అదుపులో షుగర్‌ లెవల్స్ ఉల్లి డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం ఉంది. ఉల్లిపాయ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ అందులో ఉంటాయి. బరువు తగ్గుదల ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. బరువు తగ్గడం: ఉల్లిపాయలు తక్కువ కాలరీలు ఉండడమే కాకుండా అధిక ఫైబర్ కంటెంట్‌ కలిగి ఉంటుంది. ఇది కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మెదడు పనితీరు పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. మెదడు పనితీరును యాక్టివ్‌ చేస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేలా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ రసాయాలు ఉండటం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. గుండె రక్షణ ఉల్లిపాయలలోని సల్ఫర్ ఉండటం కారణంగా రక్తపోటును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. అంతేకాదు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23745/