schedule Wednesday, September 16, 2026

పేకాట స్థావరంపై దాడులు

calendar_today February 12, 2024
person dharshininews
పేకాట స్థావరంపై దాడులు
పేకాట స్థావరంపై దాడులు - దొరికిన ఇద్దరు, నలుగురు పరారు - కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: గుట్టుగా పేకాట ఆడుతున్న స్థావరంపై తాండూరు సబ్ డివిజన్ కరణ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన వెంకటప్ప, అంజిలప్ప, బంటు నర్సింలు, ఈదుల ఆశప్ప, నల్లొల్ల అంజిలప్ప, కుర్వ మల్లప్ప పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు దొరికిపోగా.. మిగతా నలుగురు పరారయ్యారు. పేకాట స్థావరం నుంచి రెండు జతల పేకాట ముక్కలు, రూ.3,175లను స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆరు పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిషేధిత జూదానికి అందరు దూరంగా ఉండాలని, ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23806/