ప్రతినెలా 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ..!
February 13, 2024
dharshininews
ప్రతినెలా 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ..!
- కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం
- ప్రారంభించిన ప్రధాని మోడి
- ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్: దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అందించిన మంచి శుభవార్త ఇది. ప్రతినెలా 300ల యూనిట్ల కరెంటును ఫ్రీగా అందించాలని చేపట్టిన కొత్త పథకాన్ని దేశ ప్రధాని మోడి ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్వయంగా ప్రకటన చేశారు. ఇందుకోసం సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘సౌరశక్తిని, స్థిరమైన అభివృద్ధిని మరింత విస్తృతం చేద్దాం. గృహ వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ ‘సూర్య ఘర్’ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నా. ఇందుకోసం pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని మోదీ వెల్లడించారు.
https://twitter.com/narendramodi/status/1757308775399096596?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1757308775399096596%7Ctwgr%5E993c3420486a27decb98793d4f1d64c260f5376d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnational-news%2Fpm-modi-launches-muft-bijli-free-electricity-scheme-shares-link-to-join-537613.html
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు.. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. వారు తమ పరిధిలో ఈ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు.
రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ అంటే ఏమిటి..
ఇంటి పైకప్పుపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను అమరుస్తారు. ఈ ప్యానెళ్లలో సోలార్ ప్లేట్లను ఉంచుతారు. సూర్యకిరణాల నుంచి శక్తిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత ఇది. సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే ప్యానెళ్లలో ఫోటోవోల్టాయిక్ కణాలు అమర్చబడి ఉంటాయి. పవర్ గ్రిడ్ నుంచి వచ్చే విద్యుత్ మాదిరిగానే ఈ విద్యుత్ కూడా పనిచేస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ అమర్చడానికి రూ.45 నుండి 85 వేల వరకు ఉంటుంది. ఇది కాకుండా, బ్యాటరీ ఖర్చు ఉంటుంది. అదేవిధంగా 5 కిలోవాట్ల సోలార్ ప్యానల్ ఏర్పాటుకు రూ.2.25 నుంచి 3.25 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, మీరు కరెంటు బిల్లు ఖర్చును చూస్తే, మీ బిల్లు 5-6 సంవత్సరాల తర్వాత జీరో అవుతుంది, ఎందుకంటే మొత్తం ఖర్చు 5-6 సంవత్సరాలలో రికవరీ అవుతుంది.
రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?
https://solarrooftop.gov.in/consumerRegistration పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
వినియోగదారుడి నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి
అప్రూవల్ వచ్చిన తర్వాత డిస్కమ్ అనుమతి ఉన్న వెండర్ ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి
సోలార్ ప్లాంట్ వివరాలు సమర్పించి మీటర్‌కు అప్లికేషన్ పెట్టుకోవాలి
మీటర్ పెట్టిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి సంబంధిత వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు
డిస్కమ్ రిపోర్టు వెరిఫికేషన్ తర్వాత సబ్సిడీ నగదు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది
రూఫ్‌టాప్ సోలార్ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
రూఫ్‌టాప్ సోలార్ పాలసీలో రెండు కేటగిరిలు
మొదటి కేటగిరి:
0-3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడి
3-10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.9 వేల సబ్సిడి
స్పెషల్ కేటగిరి:
0-3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.20 వేల సబ్సిడీ
3-10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ. 10 వేల సబ్సిడీ
(సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్‌లోని విద్యుత్ వినియోగదారులకు మాత్రమే స్పెషల్ కేటగిరి వర్తిస్తుంది)
2024 జనవరి 1 తర్వాత నేషనల్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లకు సబ్సిడి వర్తింపు
మేడిన్ ఇండియా సోలార్ ప్యానెల్స్/మాడ్యూల్స్ మాత్రమే వినియోగించాలి
సోలార్ ఇన్సిస్టిలేషన్‌కు సంబంధించి వెండర్ నుంచి ధృవీకరణ పత్రం అవసరం
డిస్కమ్ ధృవీకరించిన మొత్తం సోలార్ మాడ్యూల్ కేపాసిటీ, ఇన్వర్టర్ కెపాసిటీ ఆధారంగా సబ్సిడిని లెక్కిస్తారు
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/23823/