schedule Saturday, September 05, 2026

రేపు తాండూరుకు గోవా సీఎం రాక..!

calendar_today February 19, 2024
person dharshininews
రేపు తాండూరుకు గోవా సీఎం రాక..!
రేపు తాండూరుకు గోవా సీఎం రాక..! - బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల ఆగమనం - తాండూరు నుంచే బీజేపీ ప్రతిష్టాత్మక కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరుకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ హాజరవుతున్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కూడా తరలివస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రేపు వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నుంచి బీజేపీ రాజ రాజేశ్వరీ బస్సు యాత్రను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. కావున పార్టీ నాయకులు, అనుంబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/23992/