schedule Saturday, September 12, 2026

హోటల్‌ ఘర్షణలో నా తప్పేమి లేదు

calendar_today March 6, 2024
person dharshininews
హోటల్‌ ఘర్షణలో నా తప్పేమి లేదు
హోటల్‌ ఘర్షణలో నా తప్పేమి లేదు - అట్రాసీటి కేసులో సరైన న్యాయం చేయాలి - బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వివాదాస్పద హోటల్‌ ఘర్షణలో తన తప్పేమి లేదని, తనపై నమోదైన అట్రాసిటీ కేసులో సరైన న్యాయం చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. బుధవారం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేషన్ సమీపంలోని పాన్‌ షాప్, పక్కన ఉన్న ఎంఎస్డీ హోటల్‌ నిర్వహకుల మద్య షెడ్డు విషయంలో గోడవ జరిగిందని తెలిసి సోమవారం సాయంత్రం మాట్లాడేందుకు వెళ్లడం జరిగిందని గుర్తుచేశారు. ఈక్రమంలో ఎంఎస్డీ హోటల్ నిర్వహకులతో మర్యాదగా మాట్లాడుతుండగానే సెల్ ఫోన్‌లో రికార్డు చేస్తూ దురుసుగా మాట్లాడారని వివరించారు. రెచ్చగొట్టే విధంగా దుర్భాషలు ఆడారని అన్నారు. దీంతో ఇరు వర్గాల మద్య గొడవ జరిగిందన్నారు. హెటల్‌ నిర్వహకులు రాహుల్ అనే వ్యక్తి ఓ సామాజిక వర్గానికి చెందినవాడని తనకు తెలియదన్నారు. పోలీస్టేషన్లో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. హోటల్‌ ఘర్షణలో తన తప్పేమి లేదన్నారు. పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారని, అయితే ఈ కేసులో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు తనపై విచారణ జరిపి సరైన న్యాయంచేయాలని కోరారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24279/