schedule Saturday, September 12, 2026

మట్కా నిర్వహకుడిపై కేసు

calendar_today March 6, 2024
person dharshininews
మట్కా నిర్వహకుడిపై కేసు
మట్కా నిర్వహకుడిపై కేసు - చిట్టీలు, నగదు స్వాదీనం - వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా మట్కా నిర్వహిస్తున్న నిర్వహకుడిపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సంతోష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గాంధీనగర్‌లో బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గోవింద్ అలియాస్ గోపాల్ రెడ్డి మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించి గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మట్కా చిట్టీలతో పాటు రూ. 4,600లను స్వాదీనం చేసుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఎవరైనా నిషేధిత మట్కా ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడ చదవండి... https://dharshininews.com/24292/