schedule Sunday, July 05, 2026

ఆరుగురు పేకాటరాయుళ్లపై కేసు

calendar_today March 7, 2024
person dharshininews
ఆరుగురు పేకాటరాయుళ్లపై కేసు
ఆరుగురు పేకాటరాయుళ్లపై కేసు - పేక ముక్కలు, నగదు స్వాదీనం - వెల్లడించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నిషేధిత పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులపై కరణ్‌ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు కరణ్‌ కోట్ పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. ఇందులో షేక్ రబ్బాని, ఈడిగి అశోక్, ఎండీ షఫీయోద్దీన్, షేక్ ముర్తజా, ప్రేమ్ కుమార్, ఎండీ సలీం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8060ల నగదు, రెండు జతల పేకాట ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24315/