schedule Sunday, September 06, 2026

బీఆర్ఎస్‌కు ఎంపీ రంజిత్ రెడ్డికి గుడ్‌బై..!

calendar_today March 17, 2024
person dharshininews
బీఆర్ఎస్‌కు ఎంపీ రంజిత్ రెడ్డికి గుడ్‌బై..!
బీఆర్ఎస్‌కు ఎంపీ రంజిత్ రెడ్డికి గుడ్‌బై..! - రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన - కారణాలను వెల్లడించిన రంజిత్ రెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు. రంజీత్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్‌ ఆఫర్‌ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ తరుపున చేవెళ్ల ప్రజలకి సేవ చేసేoదుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాల తెలిపారు. తన రాజీనామా ఆమోదించాలని వారికి విజ్ఞప్తి చేశారు. లోకల్ యాడ్... ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24429/