schedule Saturday, September 12, 2026

రైలు ప్రమాదంలో వ్యాపారి దుర్మరణం

calendar_today March 23, 2024
person dharshininews
రైలు ప్రమాదంలో వ్యాపారి దుర్మరణం
రైలు ప్రమాదంలో వ్యాపారి దుర్మరణం - తాండూరులో రైలు దిగుతుండగా ప్రమాదం - కుటుంబంలో విషాధం నింపిన ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు దిగుతుండగా అదుపు తప్పి కిందపడడంతో ఓ వ్యాపారి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తాండూరు రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన కనకం శివకుమార్(45) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అన్నదాత ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి తాండూరులో ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు దిగుతుండగా ప్రమాద వశాత్తు అదుపుతప్పి రైలుకింద పడిపోయాడు. దీంతో అతని తల, శరీరం రెండు భాగాలుగా చీలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన స్థానికులు, రైల్వే అధికారులు వివరాలను సేకరించి శివకుమార్‌గా గుర్తించారు. ఈ సంఘటన కుటుంబంలో విషాదం నింపింది. పలువురు వ్యాపారులు విచారం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24492/