schedule Sunday, July 05, 2026

అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య

calendar_today April 7, 2024
person dharshininews
అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య
అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య - తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన - వివరాలు వెల్లడించిన కరణ్‌ కోట్‌ ఎస్‌ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పురుగుల మందు సేవించి అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడి మృతి చెంది. ఈ సంఘటన తాండూరు మండలం జినుగుర్తి తాండాలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జినుగుర్తి తాండాకు చెందిన గంగబాయి(36) తాండాలో అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తుంది. గత కొన్ని ఏండ్ల కింద భర్త సురేష్ మృతి చెందాడు. అప్పటి నుంచి గంగబాయి మనస్థాపానికి గురైంది. దీంతో పాటు కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన గంగబాయి గత సోమవారం రాత్రి కల్లు తాగిన మైకంలో పురుగుల మందు సేవించింది. గమనించిన కుటుంభీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీశీలించిన వైద్యులు ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి శనివారం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో గంగబాయి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. మృతురాలి తల్లి జాలీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25315/