schedule Sunday, July 05, 2026

బడిలో చోరీ..!

calendar_today April 10, 2024
person dharshininews
బడిలో చోరీ..!
బడిలో చోరీ..! - వస్తువులు దోచుకెళ్లిన దుండగులు - పెద్దేముల్ జనగాంలో ఘటన - పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్ఎం తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకునే వారికి.. చదువు విలువ తెలిసిన వారికి బడి దేవుని గుడితో సమానం. అలాంటి బడిలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాఠశాలలో వస్తువులను దోచుకెళ్లారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం జనగాంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జనగాం గ్రామంలో ఎంపీ యుపిఎస్ పాఠశాల కొనసాగుతోంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలో గది తాళాలు పగలగొట్టారు. లోనికి చొరబడి సుమారు పదివేల ఆట వస్తువులను దొంగతనం ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల ఆవరణలో కొంతమంది మద్యం సేవించి మందు బాటిల్ పగలగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గిరి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25395/