schedule Sunday, July 05, 2026

ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌

calendar_today April 12, 2024
person dharshininews
ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌
ఆధారాలు లేని రూ. 1.20 లక్షల సీజ్‌ - వాహనాల తనిఖీలో గుర్తించిన పోలీసులు - వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును తాండూరు పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన అంబర్‌ పేట్ పవన్‌ కుమార్ అనే వ్యక్తి తన బైక్ మీద రూ. 1లక్ష 20వేల నగదును తరలిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్టేషన్ ముందు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అతని బైక్‌ను ఆపీ తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా పవన్ కుమార్ రూ. 1లక్ష 20వేలను తరలిస్తుండగాన్ని గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రేజరీకి తరలించినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్‌ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఎవరైనా సరే రూ.50 వేలకు మించి నగదును తరలిస్తే ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లేదంటే నగదును సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25439/