schedule Sunday, July 05, 2026

లాడ్జ్‌లో షాకింగ్ సీన్..!

calendar_today April 13, 2024
person dharshininews
లాడ్జ్‌లో షాకింగ్ సీన్..!
లాడ్జ్‌లో షాకింగ్ సీన్..! - రూంలో ఉరేసుకున్న వ్యక్తి - కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : లాడ్జీలో రూం తీసుకున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన తాండూరు పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన డంకూరు చిన్న శ్యామప్ప శుక్రవారం తాండూరు పట్టణం అవేకా లాడ్జ్‌లో 103 గదిని తీసుకున్నాడు. అతను తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి తాండూరుకు వచ్చాడు. శనివారం ఉదయం రూం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బంది లోపలికి వెళ్లి చూశారు. బాతురూం గదిలోని ఎగ్జిస్టింగ్‌ ఫ్యాన్‌కు ఉరేకుని మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంగటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని కుటుంభీకులకు సమాచారం అందించారు. అయితే శ్యామప్ప కుమారుడు సంవత్సరం క్రితం చనిపోవడంతో, కూతురు ప్రేమ వివాహము చేసుకోవడంతో మానసిక వేధనకు గురైనట్లు అతని భార్య ఫిర్యాదుకలు తెలిపింది. అతని మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్ఐ కాశినాథ్ ఓ ప్రకటనలతో తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25517/