schedule Sunday, July 05, 2026

అమానుషం..!

calendar_today May 14, 2024
person dharshininews
అమానుషం..!
అమానుషం..! - 5నెలల శిశువుపై పెంపుడు కుక్క దాడి - రక్తపు మడుగులో బాలుడు మృతి - ఆవేశంలో కుక్కను చంపేసీన కుటుంభీకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో అమానుషం చోటు చేసుకుంది. 5 నెలల శిశువుపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. విక్షణంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్ లో సంగెంకలాన్ గ్రామానికి చెందిన జి.నాగభూషణంకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వీరికి వివాహము జరిగింది. గత 5 నెలల క్రితం వీరికి బాలుడు(సాయి నాథ్‌) జన్మించాడు. మంగళవారం ఉదయం దత్తు యూనిట్లో పనిచేస్తుండగా, భార్య వస్తువులు కొనేందుకు ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో పాలిషింగ్‌ యూనిట్ యజమానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి వెళ్లి బాలుడుపై దాడి చేసి కరిచేసింది. అప్పటికే కేకలు విన్న కుటుంభీకులు వచ్చి చూసే సరికి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి కారణమైన కుక్కను ఆవేశంతో కుటుంభ సభ్యులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.   [caption id="attachment_26458" align="alignnone" width="716"] Oplus_131072[/caption] విషయం తెలుసుకున్న కరణ్‌ కోట్‌ ఎస్ఐ విఠల్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26440/