schedule Sunday, July 05, 2026

టెన్త్‌ ఫేయిల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్

calendar_today May 15, 2024
person dharshininews
టెన్త్‌ ఫేయిల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్
టెన్త్‌ ఫేయిల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్ - తాండూరు ముస్లిం వెల్పేర్ నిర్ణయం - రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో ఫేయిల్ అయిన విద్యార్థుల కోసం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకుంది. టెన్త్ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ అందించేందుకు సిద్దమయ్యింది. పదో తరగతి గణితం(మాథ్స్)లో ఉచిత తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రేపటి నుంచి విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల తరువాత తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ కార్యాలయంలో 17వ తేది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తిగత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ : 9652819742, 9505268832లకు సంప్రదించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26497/