schedule Sunday, July 05, 2026

ప్రాణాలు తీసిన పిడుగు..!

calendar_today May 19, 2024
person dharshininews
ప్రాణాలు తీసిన పిడుగు..!
ప్రాణాలు తీసిన పిడుగు..! - యాలాల మండలంలో ముగ్గురి మృతి - కుటుంబాలలో విషాధం తాండూరు, దర్శిని ప్రతినిధి: పిడుగు పాటు వల్ల వేరు వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పో్యారు. ఈ విషాధకర సంఘటనలు యాలాల మండలంలో చోటు చేసుకున్నాయి. మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన వెంకటయ్య(62) గ్రామ సమీపంలో భార్య ఎల్లమ్మతో కలిసి పొలం పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం తరువాత ఉరుములతో కూడిన వర్షం పడింది. వర్షంతో పాటు పిడుగు పడడంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందింది. భార్య ఎల్లమ్మ కొద్ది దూరంలో పనిచేస్తుండగా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అదేవిధంగా అదే మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన కొనింటి లక్ష్మయ్య(52), మంగలి శ్రీనివాస్‌(27)లపై కూడా పడడంతో వారు కూడా దుర్మరణం చెందారు. ఈ పిడుగు పాటు యాలాల మండలంలో తీవ్ర కలకలం రేపగా.. మృతుల కుటుంబాల్లో విషాధం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26573/