schedule Sunday, July 05, 2026

మరో ఊపిరి తీసిన పిడుగు..!

calendar_today May 20, 2024
person dharshininews
మరో ఊపిరి తీసిన పిడుగు..!
మరో ఊపిరి తీసిన పిడుగు..! - చెట్టు మీదపడి వ్యక్తి దుర్మరణం - పదేహేడేళ్ల బాలుడికి గాయాలు - పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గాన్ని పిడుగు పాట్లు హడలెత్తిస్తున్నాయి. యాలాల మండలంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన మరువకముందే తాండూరు మున్సిపల్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. చెట్టుమీద పిడుగు పడడంతో అక్కడే ఉన్న వ్యక్తి ఊపిరి ఆగిపోగా ఓ పదిహేడేళ్ల బాలుడు గాయాల పాలయ్యాడు. సోమవారం జరిగిన సంఘటన మృతుని కుటుంబంలో విషాధం నింపింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత తాండూరుకు చెందిన పూరీ శేఖర్(40) కిరాణ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కూమారులు భరత్‌, శివాజీలు ఉన్నారు. సోమవారం సాయంత్రం వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లిన శేఖర్ అప్పడే వర్షం రావడంతో అక్కడే ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే ప్రాంతంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన హన్మంతు(17) అనే బాలుడు కూడా చెట్టు కిందకు వచ్చాడు. అకస్మాత్తుగా చెట్టుమీద పిడుగు పడడంతో అక్కడే ఉన్న శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు హన్మంతుకు గాయాలయ్యాయి. మరో వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శేఖర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. బాలుడు హన్మంతుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు ఆందోళనకర స్థితిలో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. మరోవైపు నిరుపేద కుటుంబానికి చెందిన శేఖర్ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంభీకులు, స్థానికులు కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26628/