schedule Sunday, July 05, 2026

పిడుగు మరణాలు బాధాకరం.!

calendar_today May 21, 2024
person dharshininews
పిడుగు మరణాలు బాధాకరం.!
పిడుగు మరణాలు బాధాకరం.! - బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి - కుటుంబానికి ఆర్థిక చేయూత అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వరుస పిడుగు పాటు మరణాలు జరగడం బాధాకరమని కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో పిడుగు పడి మృతి శేఖర్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఆసుపత్రికి మార్చురికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో వరుస పిడుగు ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. పిడుగు పాటుతో నిరుపేద కుటుంబానికి చెందిన శేఖర్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్థంబాల వద్ద ఉండరాదని సూచించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత అందించారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, కోట్ల రాజు, వికాష్‌ జోషి, బాతుల నాగేష్‌, బీజేపీ నాయకులు నారా శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/26653/