schedule Sunday, July 05, 2026

పత్తి పొలంలో పిడుగు..!

calendar_today June 13, 2024
person dharshininews
పత్తి పొలంలో పిడుగు..!
chai jr పత్తి పొలంలో పిడుగు..! - మహిళ కూలీ మృతి - మరో యువతికి గాయాలు - పరామర్శించిన మాజీ ఎంపీపీ, నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పత్తి పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడి ఓ ఓ మహిళ కూలీ మృతి చెందింది. మరో యువతికి గాయాలై ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన్ మహేష్ అనే యువకుడితో ఏడాది క్రితం దుద్యాలకు చెందిన మధులత(21)తో వివాహము జరిగింది. గ్రామంలోని మాజీ ఎంపీపీ శరణు బసప్పకు చెందిన పొలాన్ని ఎన్కెపల్లి నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ఈ పొలంలో పత్తి గింజలు నాటే పనులు చేసేందుకు 20 మంది కూలీలకు మాట్లాడుకున్నారు. గురువారం పొలంలో పత్తి గింజలు నాటేందుకు ఈ కూలీలలో మధులత, దస్తమ్మ అనే యువతి కూడా పనులకు వచ్చారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమయ్యింది. కూలీలందరు ఓ వైపు వస్తున్నారు. అప్పుడే పొలం సమీపంలో పిడుగు పడింది. దీంతో మధులత, దస్తమ్మలు కుప్పకూలీ పడిపోయారు. గమనించిన కౌలు యజమాని నర్సయ్య గౌడ్, కూలీలు ఆటోలో చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మధులత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో యువతి దస్తమ్మ తీవ్రగాయాలై ప్రాణాలతో బయటపడింది. మధులత మరణంతో కుటుంభీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ శరణు బసప్ప, గ్రామ నాయకులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27134/