schedule Sunday, September 13, 2026

లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి

calendar_today June 16, 2024
person dharshininews
లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి
chai jr లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి - అంతారం గ్రామ శివారులో ఘటన - దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : లారీ, బైకు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో జరిగింది. స్థానికుల ప్రాథమిక వివరాల మేరకు పెద్దేముల్‌ మండలం కందనెల్లి తాండాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బైకుపై తాండూరు నుంచి తాండాకు వెళుతున్నాడు. తాండూర్ మండలం అంతారం గ్రామ శివారులోని బైపాస్ రింగ్ రోడ్డు దగ్గర లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27222/