schedule Friday, September 11, 2026

ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలి

calendar_today June 27, 2024
person dharshininews
ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలి
chai jr ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలి - వాహనదారులకు పోలీసుల అవగాహన - లీగల్ సర్వీస్ కమిటి న్యాయ విజ్ఞాన సదస్సు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తాండూరు పట్టణ ఎస్ఐ కాశినాథ్ అన్నారు. గురువారం తాండూరు న్యాయస్థానంలోని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్టేషన్‌ వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కాశీనాథ్, ట్రాఫిక్ ఏఎస్ఐ ఆనంద్‌లు ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. బైకులపై వెళ్లే వారు హెల్మెట్, కారులో వెళ్లే వారు సీటు బెల్టులు ధరించాలని సూచించారు. అందరు ట్రాఫిక్‌ రూల్స్ విధిగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల లీగల్ సర్వీస్ కమిటీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వాహనదారులు పాల్గొన్నారు. ఇదికూడ చదవండి.. https://www.dharshininews.com/27456/